హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసిన SPR సొసైటీ

Spread the love

హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసిన SPR సొసైటీ మరియు నవయువ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గాజుల రామారం లాల్ సాహెబ్ గూడ కు చెందిన ఎస్పిఆర్ సొసైటీ మరియు శ్రీరామ్ నగర్ – ఏ కు చెందిన నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసి కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ముందుగా నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు అని, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గతంలో పాలకవర్గ సభ్యులతో కలిసిమెలిసి కాలనీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

లాల్ సాహెబ్ గూడ ఎస్పీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్: అధ్యక్షులు కోపాలింగం, ప్రధాన కార్యదర్శి మద్దెల మల్లేష్, కోశాధికారి ఉప్పరి రాజు, సలహాదారులు రవీందర్, సాయిబాబా, అశోక్, పాండు….

నవయువ వెల్ఫేర్ అసోసియేషన్ : అధ్యక్షులు మరియూరి మహేష్, ప్రధాన కార్యదర్శి వెంకట రమణయ్య, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, మహేష్, సిద్ధులు, హైమద్, సంయుక్త కార్యదర్శి, సమద్, మహేష్, ప్రెసిడెంట్ అజయ్, ఫెరొజ్ ఆర్గనైజర్లు మనీష్ గౌడ్, ప్రేమ్ ఇతర సభ్యులు

ఈ కార్యక్రమంలో 125 డివిజన్ మాజీ వార్డ్ మెంబర్ సింగారం మల్లేష్, కాలనీలవాసులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page