నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి – ఎస్కే షరీఫ్, జిల్లా సత్యం

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల పట్టణ కేంద్రంలో రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్న బియ్యం నల్లగా ఉండి పురుగుతో తౌడుతో తినడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నాయని సిపిఐ చిట్యాల మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్కే షరీఫ్ ఆరోపించారు. చిట్యాల పట్టణ కేంద్రంలో రేషన్ డీలర్ల వద్దకు బియ్యం తెచ్చుకొనుటకు వెళ్లిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని ఎస్కే షరీఫ్ మరియు బొలుగురి లింగయ్య పరిశీలించగా నాసిరకంగా ఉన్నటువంటి బియ్యాన్ని పట్టుకొని స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ వద్దకి తీసుకెళ్లి చూపించారు. తహాసిల్దారు మాట్లాడుతూ తినడానికి వీలు లేని బియ్యం పంపిణీ చేయవద్దని డీలర్లకు ఆదేశం జారీ చేశారు.

అనంతరం
ఆర్ఐ మరియు వీఆర్ఏలను పంపించి తినడానికి వీలు లేనటువంటి బియ్యాన్ని తిరిగి పంపించి మంచి బియ్యాన్ని ఒక్క రోజులో తెప్పిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు తినడానికి వీలుంటే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గోదాముల నుండి బియ్యాన్ని పంపిణీ చేసే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే షరీఫ్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం బొలుగూరి లింగయ్య మేకల బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page