సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలందించండి – ఏలూరు రేంజ్ IGP

Spread the love

జిల్లా సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన ” డీ మొబలైజేషన్ ” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజిపి G.V.G.అశోక్ కుమార్ ఐపీఎస్

A.R సిబ్బంది విధి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దేలా “మొబలైజేషన్” కార్యక్రమం నిర్వహణ.సాధారణ బందోబస్తు నుండి శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో A.R సిబ్బంది పాత్ర కీలకం.

A.R సిబ్బంది సంక్షేమం కొరకు పలు చర్యలు తీసుకుంటూ వివిధ పథకాలు అమలు చేస్తున్నాం.

వృత్తిపరమైన, వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తూ పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా సాయుధ బలగాల పనితీరు ఉండాలి

జిల్లా సాయుధ పోలీసు బలగాలకు 06-02-2024 నుండి 20-02-2024 వరకు నిర్వహించిన “మొబలైజేషన్ ” కార్యక్రమం ముగిసింది. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించిన డీ మొబలైజేషన్ ముగింపు కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి వి జి అశోక్ కుమార్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. IGP గారితో పాటు జిల్లా ఎస్పీ అద్నాన్న ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ G.వెంకటేశ్వరరావు , అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ శ్రీ S.V.D ప్రసాద్ , ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐజీపీ కి సమర్పించగా అనంతరం పరేడ్ వీక్షణ కోసం ప్రత్యేకంగ ఏర్పాటుచేసిన పరేడ్ పరిశీలన వాహనంలో ప్లటూన్ల వారిగా పరిశీలించారు. ఆ తర్వాత ప్లటూన్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు.పెరేడ్ మరియు బ్యాండ్ సిబ్బందిని చాలా చక్కగా ప్రదర్శించారని IGP అభినందించారు.

ఈ సందర్భంగా IGP మాట్లాడుతూ సివిల్ విభాగం తమ యొక్క విధుల పరంగా బయటకు కనిపిస్తుంది కానీ అర్ముడు రిజర్వుభాగం ఎవరికీ కనబడకుండా విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తుంది ప్రమాదకరమైన వస్తువులను వ్యక్తుల కు భద్రత కల్పించడం,కీలక బందోబస్తు నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏ.ఆర్ సిబ్బందికి ప్రతీ ఏటా మొబలైజేషన్ కార్యక్రమం నిర్వహించి విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ ను మెరుగుపరచడం ఆనవాయితీగా వస్తుంది. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ మొబిలైజేషన్ దోహదం చేస్తుంది. మొబలైజేషన్ కార్యక్రమంలో వృత్తి నైపుణ్యాల పెంపునకు ఇన్డోర్/అవుట్ డోర్ క్లాస్ లు, సర్వీస్ రూల్స్, అత్యాధునిక ఆయుధాలను ఎలా హ్యాండిల్ చేయాలి, ఫైరింగ్, డ్రిల్, మార్చ్ ఫాస్ట్, మాబ్ కంట్రోల్, VIP ఎస్కార్ట్స్, PSO, బి.డి టీం, ప్రిజనర్స్ ఎస్కార్ట్, బందోబస్త్, మోటార్ వెహికల్ డ్యూటీలు, CPR, ప్రథమ చికిత్స విధానాలు తదితర అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా సిబ్బంది మంచి తర్ఫీదు పొందారని తెలిపారు.

సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు మూడవ శుక్రవారం ‘గ్రీవెన్స్ డే’ ను నిర్వహిస్తున్నామని, సిబ్బందిలో ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావచ్చు. లేదా మీ సంబంధిత అధికారులకు మీ సమస్యను విన్నవించుకున్న వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి వెంటనే తగు చర్యలు తీసుకొని సత్వరం పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.

ఏ.ఆర్ సిబ్బంది సాధారణ బందోబస్తు విధుల నుండి శాంతిభద్రతల సమస్యల వరకు కీలక పాత్ర పోషిస్తున్నారని, జిల్లాల పునర్వీభజన తరువాత కొంతమంది సిబ్బందిని ఇతర జిల్లాలకు కేటాయించినప్పటికీ ఉన్న అంతకు ముందు సిబ్బందితోనే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. మారుతున్న కాలానుగుణంగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు సమర్థవంతమైన విధుల నిర్వహణ కోసం శారీరక ధృడత్వానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని, వృత్తి, వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడంలో జిల్లా ఏఆర్‌ విభాగానికి మంచి పేరు తీసుకురావాలని, పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా సాయుధ బలగాల పనితీరు ఉండాలని కోరారు. ఏఆర్ సిబ్బంది ప్రత్యేకంగా పాటించవలసింది తమ శరీరంలో ఒక భాగంగా ఆయుధాలను ఉపయోగించాలని ఆయుధాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అలాగే రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంసిద్ధంగా ఉండాలని, అలాగే ఎన్నికల నేపథ్యంలో పెరిగే విధులను దృష్టిలో ఉంచుకొని సమయాభావం పాటిస్తూ సమయస్ఫూర్తిగా విధులు నిర్వర్తించాలని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతంగా ముగిసేలా ప్రతి ఒక్కరు కీలకంగా వ్యవహరించాలని తెలిపారు.

పెరేడ్ గ్రౌండ్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం మరియు మొబిలైజేషన్ ప్రక్రియలో కీలకంగా విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందిని, అలాగే పెరేడ్ ను క్రమశిక్షణతో చక్కగా నిర్వహించిన పెరేడ్ కమాండర్ ను ఏలూరు రేంజ్ IGP ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం పోలీస్ జాగిలాల , బాంబ్స్క్వాడ్ యొక్క విన్యాసాలు అత్యద్భుతంగా ప్రదర్శించగా వాటిని గూర్చి ఏలూరు రేంజ్ IGP ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి ఆయుధాలను భద్రపరచు విభాగానికి వెళ్లి అక్కడ ఎన్ని ఆయుధాలు ఉన్నది, అవి ఏ విధంగా పనిచేసేది, వాటికి సంబంధించిన రికార్డులన్నీటిని ఏలూరు రేంజ్ IGP , ఎస్పీ తో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు

Related Posts

You cannot copy content of this page