పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు

Spread the love

పక్కా ప్లాన్.. సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్..

సీఎం జగన్‌పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టింస్తోంది. అసలు సతీష్‌ వెనుక ఎవరున్నారు…? స్కెచ్‌ వేసిందెవరు…? అనే విషయాలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సీఎం జగన్‌పై దాడి కేసులో ఏ1గా ఉన్న సతీష్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. అయితే.. అంతకుముందు బయటకొచ్చిన సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

సీఎం జగన్‌పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టింస్తోంది. అసలు సతీష్‌ వెనుక ఎవరున్నారు…? స్కెచ్‌ వేసిందెవరు…? అనే విషయాలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సీఎం జగన్‌పై దాడి కేసులో ఏ1గా ఉన్న సతీష్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. అయితే.. అంతకుముందు బయటకొచ్చిన సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎంను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు. దాడి కోసం నిందితుడు కాంక్రీట్‌ రాయి వాడాడని తెలిపారు. ఏ2గా ఉన్న దుర్గారావు ప్రోద్భలంతోనే ఏ1 నిందితుడు సతీష్‌ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. ఇక కాల్‌ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. 17నే నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ సీజ్‌ చేశామన్న పోలీసులు.. అన్ని విధాలా విచారణ జరిపి తర్వాతే అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.

జగన్‌ దాడి ప్రీ ప్లాన్డ్‌ గానే జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీని వెనుకు ఎంత పెద్ద వాళ్లున్నా వదిలిపెట్టమన్నారు. కేసు దర్యాప్తులో అన్ని వివరాలు తర్వలోనే బయటకొస్తాయని తెలిపారు.

సీఎం జగన్‌పై దాడికి, టీడీపీకి సంబంధం లేదని.. టీడీపీ నేత బోండా ఉమ పేర్కొన్నారు. కావాలనే టీడీపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారన్నారు. వెలంపల్లి కన్నుకు కాదు, కాలికి గాయమైందని.. సానుభూతి కోసమే కన్నుకు కట్టు కట్టుకున్నారంటూ విమర్శించారు.

వైసీపీకి వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకే దాడి చేశారంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఈ దాడి వెనక కచ్చితంగా బోండా ఉమ హస్తం ఉందన్నారు.

మొత్తంగా… సతీష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ షాక్‌కు గురిచేస్తోంది. అసలు దీని వెనక ఎవరి హస్తముందో తెలిసేలా దర్యాప్తు ముమ్మరం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page