కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ బొందయ్య

Spread the love

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ బొందయ్య

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సుంకేనపల్లి సర్పంచ్ కక్కరేని బొందయ్య కోరారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం సుంకేనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ బొందయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా కంటి వెలుగుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని అన్నారు. వైద్యాధికారి యు.నరసింహ మాట్లాడుతూ చాలామంది పాక్షిక సంపూర్ణ కంటి సమస్యలతో బాధపడుతున్నారని అలాంటి వారు ఎవరైనా సరే కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని కంటి అద్దాలు అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తున్నామని, ఆపరేషన్ అవసరమైన వారికి సంబంధిత ఆస్పత్రులకు రిఫర్ చేయడం జరుగుతుందని 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ కంటి పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలని అన్నారు. మొదటిరోజు 120 మంది పరీక్షలు చేయించు కున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంటి వెలుగు శిబిరం వైద్యాధికారిణి లక్ష్మి, ఆప్తమాలజిస్ట్ స్రవంతి, వార్డు సభ్యులు బాతరాజు రమేష్, ఆవుల సునీత, నాయకులు యాకారీ నరేందర్, ఏఎన్ఎంలు పార్వతి, సాయివాణి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page