SAKSHITHA NEWS

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు అయిన సందర్భంగా,దాని నిర్మాణం కోసం నగరంలోని ఏటుకూరు రోడ్డు నందు గల నగర పాలక సంస్థ ట్రాన్సిట్ పాయింట్ వద్ద,కొబ్బరి తోట ప్రాంతంలో మరియు శ్రీనివాసరావు పేట స్మశాన వాటిక ప్రాంతాల యందు నగర పాలక సంస్థ,విద్యుత్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి వివిధ స్థలాలను పరిశీలిస్తున్న గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు .

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ,నగర పాలక సంస్థ SE సుందర రామిరెడ్డి,పబ్లిక్ హెల్త్ SE శ్రీనివాసులు,ఎలక్ట్రిసిటీ EE తిరుమలశెట్టి శ్రీనివాసరావు,EE లు,DEE లు,AE లు,సర్వేయర్లు మరియు వారి సిబ్బంది,స్థానిక పెద్దలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS