సమాచార కరదీపిక పుస్తకావిష్కరణ చేసిన ఎమ్మెల్యే

Spread the love

సమాచార కరదీపిక పుస్తకావిష్కరణ చేసిన ఎమ్మెల్యే

నకిరేకల్ సాక్షిత

చిట్యాల మండలం సమాచార కరదీపిక పుస్తకాన్ని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆవిష్కరించారు. చిట్యాల మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొంతమంది పత్రిక విలేకరులు రూపొందించిన సమాచార కర దీపిక పుస్తకాన్ని నకిరేకల్ పట్టణంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సమాచార కరదీపిక పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి బెల్లి సత్తయ్య , జిట్ట బొందయ్య , జిట్టా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page