SAKSHITHA NEWS

Sagar completes the tasks quickly and prepares for the inauguration

సాగర్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి
సాక్షిత : * హుసేన్ సాగర్ తరహాలో వినాయక సాగర్
*డిసెంబర్ లో అందుబాటులోకి తీసుకురండి
*వినాయక సాగర్ చుట్టూ చూపరులను ఆకట్టుకోవాలి

  • మేయర్ డాక్టర్ శిరీష నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం వినాయక సాగర్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
  • స్మార్ట్ సిటీ లో భాగంగా బొంతాలమ్మ ఆలయం వద్ద గల వినాయక సాగర్ అభివృద్ధి పనులను పరిశీలించారు. హుస్సేన్ సాగర్ తరహాలో వినాయక సాగర్ అభివృద్ధి ధీటుగా ఉండాలని,
  • వినాయక సాగర్ చుట్టు పక్కల చూపరులకు ఆకట్టుకునే విధంగా సుందరీకంగా ఉండేవిధంగా చూడాలని, వినాయక సాగర్ పనులు త్వరగా పూర్తి చేయడం కోసం ఎక్కువ మంది మనుషులను పెట్టితే పనులు తొందరగా పూర్తవుతాయని, డిసెంబర్ లో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. డివైడర్ లో అందమైన చెట్లు ఉండాలని. అలాగే సాగర్ గట్టు చుట్టూ చదును చేసి ప్లాన్ ప్రకారం చెట్లు, పచ్చటి గడ్డి లాన్ ఏర్పాటు చేయాలన్నారు.
  • చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయాలని, సందర్శకులకు హోటల్స్, వాకింగ్, సైక్లింగ్ కు, స్విమ్మింగ్ పూల్ కు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. చుట్టూ పచ్చని చెట్లను పెంచడం ద్వారా మరింత అందంగా ఉంటుందని తెలియజేశారు. డిసెంబర్ మొదటి వారం లోపల పనులు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు మేయర్ శిరీష ఆదేశించారు.
  • అనంతరం కరకంబాడి రోడ్డు, బొంతాలమ్మ గుడి సమీపంలో నిర్మిస్తున్న షాపింగ్మాల్ ని పరిశీలించి త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మీడియా అడిగిన ప్రశ్నలకు మేయర్ సమాధానమిస్తూ
తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిలర్స్ ఏర్పాటు అయినప్పటి నుండి నగరంలో అభివృద్ధి పనులు సెర వేగంగా జరుగుతున్నదని అందులో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిని అభివృద్ధి పథంలో పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈకార్యక్రమంలో మేయర్ శిరీష తో పాటు యస్.ఈ.మెహన్, యం.ఈ. చంద్రశేఖర్, కాంట్రాక్టర్లు రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS