SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 17 at 2.39.41 PM

సాక్షిత : *రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా *దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో ముఖ్య అతిథిగా *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * పాల్గొన్నారు..

ఈ సందర్బంగా *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ

ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * విమర్శించారు.

ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.

రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీల చేసుకోవాలని కోరారు. ఆరు గంటలపాటు కరెంట్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు. ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే.. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశామని చెప్పారు….


SAKSHITHA NEWS