స్పందన పిర్యాదులపై సత్వరమే స్పందించాలి – మేయర్ శిరీష

Spread the love


Response Complaints should be responded to promptly – Mayor Sirisha

స్పందన పిర్యాదులపై సత్వరమే స్పందించాలి – మేయర్ శిరీష


సాక్షిత తిరుపతి* : స్పందన పిర్యాదులను పెండింగులో పెట్టకుండా సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని అధికారులనుద్దెసించి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష పిర్యాదులను స్వీకరించారు. పిర్యాదులపై స్పందించిన మేయర్ డాక్టర్ శిరీష సంబంధిత అధిజారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజల నుండి వచ్చిన పిర్యాదులపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా పిర్యాది దారులకు హామి ఇస్తూ వారిచ్చిన పిర్యాదులపై తక్షణమే తమ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపడుతారని హామి ఇవ్వడం జరిగింది. నిర్మాణం జరుగుతున్న మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం మూలలో ప్రధాన రహదారిపై బట్టల షాపు, ఆధార్, పాన్ కార్డు సర్వీస్ సెంటర్లు వ్యాపారాలు సాగీస్తున్నార‌ని, ఇందువలన ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయనే పిర్యాదుపై మేయర్ శిరీష స్పందిస్తూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

టీచర్స్ కాలనీలోని తమ స్థలంలోకి ప్రక్కనున్న అపార్ట్మెంట్ వారు మురికి నీరు వదులుతు‌న్నారని, క్రాంతినగర్లో రోడ్లు, కాలువలు నిర్మించాలని, ఎల్.బి నగర్లో రోడ్డుపైనే బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్స్ వేస్తున్నారని, ఎల్.ఐ.సి. రోడ్డులో బిటి రోడ్డు వేసేందుకు మూడు నెలలు క్రింత త్రవ్వి వెట్ మిక్స్ వేసి వదిలేయడంతో దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నామని, తిమ్మినాయుడు పాళెంలో‌ని తమ ప్లాట్ ను ఆక్రమిస్తున్నారని,

సర్వే చేయించాలనే పిర్యాదులపై మేయద్ డాక్టర్ శిరీష స్పందిస్తూ పరిశీలించి తమ అధికారులు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఎంఈ వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు లోకేష్ వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం, మునిసిపల్ ఫైర్ ఆఫిసర్ శ్రీనివాసరావు, సూపర్డెంట్ పి.రవి తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page