కొనొకార్పస్ చెట్లను తొలగించండి గుంజపడుగు కార్యదర్శి కి వినతిపత్రం

Spread the love

Remove conocarpus trees Petition to the secretary of Gunjapadu

కొనొకార్పస్ చెట్లను తొలగించండి


గుంజపడుగు కార్యదర్శి కి వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు


సాక్షిత పెద్దపల్లి జిల్లా బ్యూరో
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం లో భాగంగా గ్రామం లో నాటిన చెట్లను వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొలగించాలని బీజేపీ నాయకులు వినతిపత్రం పత్రం అందజేశారు

అనంతరం నాయకులు మాట్లాడుతూ కొనొకార్పస్ చెట్లు పర్యావరణనికి ఎవిధమైన మేలు చేయవని, ఈ మొక్కల వల్ల శ్వాస సంబందింత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, భూగర్భ జలాలను సైతం స్థంభింపచేసే ప్రభావం చూపుతాయాని, ఈ చెట్ల వెర్ల వల్ల పైపు లైన్,డ్రైనేజ్ వ్యవస్థ లను ధ్వంసం చేస్తాయని అనేక పరిశోధన,అధ్యాన సంస్థలు వెల్లడించాయని అన్నారు కెసిఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చుతో చెట్లను నాటించి ఇప్పుడు తీసివేస్తే ప్రతిపక్షాలు నిలదీస్తాయనే కారణంతో చెట్లను తొలగించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని,ప్రభుత్వం ఈ చెట్లను తొలగించాలని లేదంటే ప్రజలకు తొలగించుకునే అవకాశం కల్పించాలని

.చెట్లతో ప్రమాదం లేని యెడల ప్రజలలో భయాందోళనలు తొలిగే విధంగా స్పష్టమైన ప్రకటన చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వీరబోయిన రాజేందర్, సీనియర్ నాయకులు సాదుల తిరుపతి,వార్డు సభ్యులు కాయితి శ్యామ్, యువ నాయకులు అందే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page