పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమం

Spread the love

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయక స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉండాలని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఎలక్ట్రికల్ ఉద్యోగి రామరాజు దేవాలయ అభివృద్ధికి 1,72,000 విలువగల చెక్కును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో సర్పంచ్ విజేందర్ కు అందజేశారు. రామరాజును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేవాలయంలో పనిచేసే అర్చకులకు వేతనం అందించడంతోపాటు ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిధులు మంజూరు చేస్తున్నారని, దేవుళ్ళ కృప కటాక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు,AMC ఛైర్మెన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, రైతుబంధు మండలాధ్యక్షుడు బోయిని రాజమల్లయ్య,సర్పంచ్ విజేందర్, ఎంపీటీసీ శీలం శంకర్,మాజీ సర్పంచ్ ప్రకాష్ రావు, ఉప సర్పంచ్ మాధవరావు,మార్కెట్ డైరెక్టర్ పొన్నం చంద్రయ్యగ్రామ శాఖ అధ్యక్షుడు వీరయ్య,వెంకట రమణా రావు,క్యాదాసి సంజీవ్,మాజీ ఛైర్మెన్ పెర్మా రెడ్డి,దామోదర్ రావు,బీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page