SAKSHITHA NEWS

సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, సూరాయపాళెం గ్రామ సచివాలయ పరిధిలో 2వ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా సూరాయపాళెం, చెన్నారెడ్డిపాళెం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .*
పొదలకూరు మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించిన మంత్రి కాకాణి.
1 కోటి 15 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించిన మంత్రి కాకాణి.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు, అర్హత కలిగిన ప్రతి ఒకరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు.
ప్రజల యొక్క అన్ని అవసరాలను తీర్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉండడం చూస్తే ఆత్మసంతృప్తి కలుగుతుంది.
పంట దిగుబడి, రేటు పెరగడం వల్ల రైతులు సంతోషంగా రెండో పంటను పండిస్తున్నారు.
రెండో పంటకు కూడా సమగ్రంగా సాగునీరు అందించాం.
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రంలో కరువు విలయ తాండవం ఆడేది, పశువులకు తాగేందుకు కూడా నీరు దొరికేది కాదు.
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల మధ్య సాగునీటి కోసం గొడవలు జరిగేవి.
చంద్రబాబు హయాంలో రైతులకు సాగునీరు అందించడంలో కూడా రాజకీయ జోక్యాలు ఉండేవి.
జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రకృతి కూడా సహకరించడంతో రైతులకు సమగ్రంగా సాగునీరందించాం.
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను రైతుల ముంగిటకే చేర్చాం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్న రైతు పక్షపాత్ర ప్రభుత్వం
రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే విధంగా,.అన్ని విధాలా అండగా ఉండి, రైతులకు వ్యవసాయం లాభ సాటిగా చేశాం.
మహనీయుడు బి.ఆర్.అంబేద్కర్ కన్న కలలు, జగన్మోహన్ రెడ్డి రూపాన సాకారం అవుతున్నాయి.
గ్రామాలలో మిగిలిపోయిన అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం.
ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అధికారులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు పేరుపేరునా ధన్యవాదాలు.


SAKSHITHA NEWS