ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ

Spread the love

ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ


:సాక్షిత : జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి హాజరైన ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రైతు సమన్వయ సమితి చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్…
సీఎం కేసీఆర్‌ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష.
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో మన అనుభవంలో ఉంది.
జనగామ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.

జనగామజిల్లాగా ఏర్పటు చేసుకున్నాక మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ , 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నాము.

సీఎం కేసీఆ నిరుపేదలకు కావాల్సిన వాటిని సంక్షేమ పథకాల రూపంలో అందజేస్తుండడంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వుంటున్నారు.

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం.

వ్యవసాయ రంగానికి అన్ని రకాలగా సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

గతంలో 200 ఉన్న పెన్షన్ ను స్వరాష్ట్రంలో 2000 చేసిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుంది.

గత పాలకులకు ఇలాంటి పథకాలు అమలు చేయాలనే సోయి కూడా లేదు.

కాగ్రెస్ నాయకులు 4 వేల పింఛన్‌ ఇస్తామని తిరుగుతుండ్రు. మరి మొన్ననే కర్ణాటకలో కాంగ్రెసోళ్లు గెలిచిండ్రు.

మరి అక్కడ ఇస్తున్నది 750 మాత్రమే కదా’, మరి తెలంగాణలో 4 వేలు ఎట్లిస్తరో ప్రజలు ఆలోచన చేయాలి.
ఎలక్షన్ రాగానే సంక్రాంతికి గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు మళ్లీ కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు వస్తున్నారు.
నోటికి వచ్చిన కథలు చెప్పి ఓట్లేపిచ్చుకుందం ఆ తరువాత చూద్దం అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు.
మరి తెలంగాణ ప్రజలు మేధావులు వారి మాయ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు.
పేదల సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ కెసిఆర్ రావాలి.
ప్రజల మనసులో కేసీఆర్ ఉన్నారు.
బీఆర్ఎస్ గెలుపు కోసం గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం సైనికుల్లా పని చేయాలి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page