పోలీస్ శాఖలో భాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతిఒక్కరిలో
క్రమశిక్షణ

Spread the love
Of all those holding responsibilities in the Police Department
discipline

పోలీస్ శాఖలో భాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతిఒక్కరిలో


క్రమశిక్షణ, రోల్ క్లారిటీ ఖచ్చితంగా వుండాలని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శభరిష్ అన్నారు.
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్టాఫ్ పరేడ్ కు హాజరైన అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఆనంతరం ఆయన మాట్లాడుతూ… పోలీస్ యూనిఫాం ధరించి కీలకమైన భాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది తమకు అప్పగించిన భాధ్యతలను సమయపాలన పాటిస్తూ సక్రమ పద్దతిలో నిర్వహించాలన్నారు

. అందుకు అనుగుణంగా పై అధికారులు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ…అన్ని పోలీస్ స్టేషన్లలో, హెడ్ క్వార్టర్స్ లో క్రమం తప్పకుండా చక్కని యూనిఫాంతో స్టాఫ్ పరేడ్ విధిగా కొనసాగించాలన్నారు.
విధినిర్వహణలో వున్న
పోలీసుల ప్రవర్తన తీరుతోనే ప్రజలలో పోలీసు వ్యవస్థపై మరింత గౌరవం పెరుగుతుందనే విషయాన్ని గ్రహించాలని అన్నారు.


కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏ అర్) కుమారస్వామి, టౌన్ ఏసీపీ అంజనేయులు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్,సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి, ఏసీపీ బాబురావు, సిఐలు,రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page