రంజాన్ మాసానికి మరేది సాటిరాదు మహ్మద్ అబ్దుల్ ఖవీ

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆధ్యాత్మిక ఆనందానికి, ఆరోగ్య జీవనానికి రంజాన్ అద్భుత మాసమని, దీనికి సాటి మరొకటి లేదని తెలంగాణ రాష్ట్ర దీని మదర్సాల సలహా సంఘం రాష్ట్ర అద్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ఖవీ అన్నారు. రంజాన్ నెలలో చేసే పుణ్య కార్యాలు.. సోదర భావం.. ఉపవాసాలు.. ఆహార నియమాలు పూర్తిగా అలవర్చుకోవడం ద్వారా మనిషి సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించగలుగుతాడని అభిప్రాయపడ్డారు. నగర శివారు గొల్లగూడెంలోని ఇదారా తాలీముల్ ఇస్లాం మదర్సాలో శనివారం ఖత్మే ఖురాన్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అబ్దుల్ ఖవీ ముఖ్య అతిథిగా హాజరై, ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. రంజాన్ మాసంలో చేసే ప్రతి దైవ కార్యానికి ఏడు రెట్ల పుణ్య ఫలం లభిస్తుందని, ఇంతటి మహత్తర మాసాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. పేద, ధనికులు, స్వల్ప కాలిక రోగులు సాకులు చూపి ఉపవాసాలను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. యువకులు నిష్ట తో నమాజ్, ప్రార్ధనల్లో భాగస్వాములు కావాలని, చెడు వ్యసనాలకు చరమగీతం పాడాలని హితబోధ చేశారు. సమస్త మానవాళి కోసం అవతరించిన పవిత్ర గ్రంథం ఖురాన్ చదవడం.. వినడం.. నేర్చుకోవడానికి సమయం కేటాయించాలని కోరారు. ముస్లింలు అధికంగా నివాసముండే ప్రాంతాల్లో మొహల్లా కమిటీలు ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొనసాగించాలని మహ్మద్ అబ్దుల్ ఖవీ సూచించారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం వినడం కోసం నగర ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం అర్థరాత్రి దాటే దాకా కొనసాగి.. ఆయన చేసిన దువాతో ముగించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖవీ ని తాలిముల్ ఇస్లాం మదర్సా ట్రస్టు సభ్యులు, నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మదర్సా కరస్పాండెంట్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ, ముఫ్తీ జలాలుద్దీన్ లు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page