అర్హులైన ఏ ఒక్క పెన్షన్ తొలగించడం లేదు : కమిషనర్ అనుపమ అంజలి

Spread the love

Not a single pension of the eligible ones will be removed: Commissioner Anupama Anjali

అర్హులైన ఏ ఒక్క పెన్షన్ తొలగించడం లేదు : కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : * తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల సాంఘిక సంక్షేమ పెన్షన్లకు
సంబంధించి 1274 మంది పెన్షనర్లకు వారి పెన్షన్ మంజూరు విషయమై అర్హత గురించి నోటీసులు మాత్రమే జారీ
చేయడం జరిగినదని,

అర్హులైన ఏ ఒక్కరిని తొలగించలేదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం పెన్షనరు యొక్క అర్హతను తెలియజేస్తూ పెన్షనుదారు ఇంటి విద్యుత్ వినియోగము 300 యూనిట్లు దాటరాదని, సొంత ఇల్లు వెయ్యి అడుగులు విస్తీర్ణం దాటరాదని, పెన్షనుదారు పేరిట ఆధర్ సీడింగ్ అయిన 4 చక్రముల వాహనము రిజిస్ట్రేషన్
కలిగియుండరాదని, ఆటోకు మినహాయింపు


కలదని, పెన్షనుదారు ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించి ఉండరాదని, మొదలగు ప్రభుత్వ నిభందనల మేరకు పెన్షను మంజూరు అర్హత నిర్ణయించబడుతుందని కమిషనర్ తెలియజేసారు. ప్రస్తుతము జారీ చేయుచున్న 1274 నోటీసులు సంబంధించి సచివాలయ సిబ్బంది
ద్వారా సమగ్ర విచారణ పూర్తి అయిన


తర్వాత అర్హుల జాబితాను సంబంధిత సచివాలయములో నోటీసు బోర్డు మీద ప్రచురిస్తామన్నారు.
ప్రస్తుతమునకు నోటీసులు మాత్రమే జారీ చేయుచున్నామని, ఎ ఒక్క పెన్షను తొలగించడము లేదని కమిషనర్ స్పష్టం చేసారు. అర్హులైనటువంటి ఏ ఒక్క పెన్షను కూడా తొలగించడము ప్రభుత్వ ఉద్దేశము
కాదని తెలియజేస్తూ, అర్హులన ప్రతి ఒక్కరికీ పెన్షను ఇవ్వడము ప్రభుత్వము వారి లక్ష్యమని, ప్రస్థుతము తిరుపతి నగరపాలక


సంస్థ పరిధిలో క్రొత్తగా 2153 పెన్షన్ లను మంజూరు చేయడము జరిగినదన్నారు. ఈ విషయముగా ఏ ఒక్క
పెన్షనుదారుడు భయాందోళనకు గురి కావలసిన అవసరము లేదని కమిషనర్ అనుపమ అంజలి తెలియజేసారు.

Related Posts

You cannot copy content of this page