క్రికెట్ క్రీడాకారిణి త్రిషకు నామ అభినందన

Spread the love

Nama Abhinandana for cricket player Trisha

క్రికెట్ క్రీడాకారిణి త్రిషకు నామ అభినందన

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

భారత అండర్ – 19 మహిళా క్రికెట్ జట్టులో తెలంగాణ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన యువతికి చోటు దక్కడం పట్ల టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో యువతిని అభినందించారు.

భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష ను ఈ సందర్భంగా నామ ప్రత్యేకించి, అభినందించి, త్రిష ఎంపికపై నామ ఆరా తీశారు. ఈనెల 27 నుంచి న్యూజిలాండ్ ముంబాయి వేదికగా జరిగే భారత మహిళా జట్టు తరఫున త్రిష ఆడబోతుండడంతో నామ త్రిషను అభినందించి, ఆశీర్వదించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పేరు ప్రతిష్టలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ఇనుమడింపజేయాలని నామ అభిలషించారు. న్యూజిలాండ్ లో జరిగే సిరీస్ లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చి, జట్టుకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ అండర్ – 19 జట్టు తరఫున త్రిష అల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిందన్నారు. ఎనిమిదేళ్ల వయస్సులో అండర్ 16 క్రికెట్ జట్టుకు ఆడిన త్రిష 12 ఏళ్లకే హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి,ఎంతో ప్రతిభ కనబరుస్తూ వస్తుందని నామ పేర్కొన్నారు.

బౌలింగ్, బ్యాటింగ్ లో అత్యంత ప్రతిభ చూపుతున్న త్రిష భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిభిరాలకు అధిరోహించాలని నామ అకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page