My aim is to provide better healthcare to rural people
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే నా లక్ష్యం: డాక్టర్ విజయ్ కుమార్
సాక్షిత ప్రతినిధి.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మునిసిపాలిటీ లో గల గవర్నమెంట్ హాస్పటల్ లో నూతనంగా డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ విజయకుమార్ కల్వకుర్తి మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యుత్తమ వైద్యం అందిస్తానని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
1988లో జన్మించిన డాక్టర్ విజయకుమార్ అతికొద్ది కాలంలోనే 2007లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. డిజిఓ ఉస్మానియా యూనివర్సిటీలో 2016 -17 సంవత్సరంలో పూర్తిచేసి కొల్లాపూర్ లో 2019 నుండి 22 వరకు హాస్పటల్లో చేశారు. మూడు సంవత్సరాలు కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు డాక్టర్ గా సేవలు అందించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలోని ఎంతోమంది మహిళలకు నార్మల్ డెలివరీలు చేసి నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ చే అవార్డు అందుకున్నారు.
ఎంతోమంది మహిళలకు నార్మల్ డెలివరీలు చేసిన ఘనత డాక్టర్ విజయ్ కుమార్ కే దక్కింది. ఒక డాక్టర్ గా చేరిన అనతి కాలంలోనే నార్మల్ డెలివరీలు చేసి కలెక్టర్ చే అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఇదే స్ఫూర్తితో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు కూడా అత్యుత్తమ వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన సేవలు అందేలా తన వంతు కృషి చేస్తానని కల్వకుర్తి డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు.
డాక్టర్ వీరమల్ల విజయకుమార్ చిన్ననాటి నుండి పేద ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందానని, గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణాలలో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ తన మార్కు చాటుకుంటున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చే మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రెగ్నెన్సీ తో వచ్చిన మహిళలకు నార్మల్ డెలివరీలు చేయడం జరిగింది.
గవర్నమెంట్ హాస్పిటల్ కు నమ్మి వచ్చేవారికి 100% న్యాయం జరుగుతుందని డాక్టర్ అంటేనే ఒక నమ్మకమని ఆ నమ్మకానికి నిర్వచనమే డాక్టర్ విజయ్ కుమార్ అని కొందరు మహిళలు అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టించుకోని ఈ రోజుల్లో డాక్టర్ విజయకుమార్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ ల పై ప్రజలకు నమ్మకం కలిగిందని ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందుతుందని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు కూడా అలాంటి వైద్యమే అందిస్తానని ప్రవేట్ హాస్పిటల్ ల కన్నా ప్రభుత్వ హాస్పిటల్ మిన్న అనే విధంగా కల్వకుర్తి నియోజకవర్గం లో పనిచేస్తానని కల్వకుర్తి ప్రభుత్వ డాక్టర్ డాక్టర్ వీరమల్ల విజయ్ కుమార్ అన్నారు.