ముకురాల ప్రభుత్వ పాఠశాల , పురుగుల ఉన్న నీళ్ళు, మూత్రశాల పక్కన భోజనం, పెచ్చులూడి పడుతున్న గోడలు

Spread the love

ముకురాల ప్రభుత్వ పాఠశాల , పురుగుల ఉన్న నీళ్ళు, మూత్రశాల పక్కన భోజనం, పెచ్చులూడి పడుతున్న గోడలు
సాక్షిత ప్రతినిధి. స్వీపర్లకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు మండలం మొత్తం ఈ విధంగానే ఉంది నేను ఏమి చేయలేను అన్న ఎంఈఓ

పాఠశాలని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అనిల్ గౌడ్

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రభుత్వ స్కూళ్ళ అన్నింటినీ సందర్శించాలని డిమాండ్ , విధ్యార్థులతో కలసి ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసనకి దిగుతామని హెచ్చరిక

ఇవాళ కల్వకుర్తి మండలం లోని ముకురాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ తాలుకా అధ్యక్షులు అనిల్ గౌడ్ ముకురాల గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలసి సందర్శించారు.ఈ సందర్భంగా విధ్యార్థులతో వారు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్కూల్ లో కనీస మౌళిక వసతులు లేవని , మహిళా దినోత్సవం నాడు మా ప్రభుత్వం మహిళల కోసం గొప్పలు చేస్తుందని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇక్కడ కనీసంగా టాయిలెట్లు లేవని అన్నారు.

విధ్యార్థులు తాగే నీళ్ళ ట్యాంకు శుభ్రం చేయక దుర్గందంతో , పురుగులతో ఉందని ఆ నీరు విధ్యార్థులు అలాగే తాగుతున్నరని పేర్కొన్నారు.దీని మీద హెడ్ మాస్టర్ ని వివరణ అడగగా స్వీపర్ లేడని కడిగే వారు లేరని సమాధానం ఇవ్వడం భాధాకరం అన్నారు.టాయిలెట్ల పక్కన భోజనాలు తింటూ విధ్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

భవనం మొత్తం పెచ్చులూడుతున్నాయని ఎప్పుడు ఎవరి నెత్తి మీద పడుతుందో తెలియక విధ్యార్థులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని తెలిపారు.మధ్యాహ్న భోజనం పరిస్థితి ఇంకా దారుణమని తెలిపారు.

ఈ విషయాలని ఎం ఈ ఓ దృష్టికి తీసుకుపోగా ఆ ఒక్క స్కూలే కాదు మండలం మొత్తం అలానే ఉందని ఉన్న స్వీపర్ లకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వక వారిని తొలగించామని ఏమీ చేయలేమని తెలపడం ప్రభుత్వ చేతగాని తనాన్ని చూయిస్తుందని మండిపడ్డారు.

కె.జి టు పి.జి హామీ పక్కన బెట్టారు కనీసం ఉన్న విద్యావ్యవస్థ ని అయినా కాపాడండి అని ప్రభుత్వాన్ని కోరారు. MLA జైపాల్ యాదవ్ ప్రతి ప్రభుత్వ స్కూల్ ని సందర్శించి అక్కడి ఇబ్బందులని గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఇదే విధ్యార్థులతో కలసి MLA ఇంటి ముందు నిరసనకి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బి.సి సెల్ బ్లాక్ అధ్యక్షులు సైదులు యాదవ్ , ముకురాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, భరత్ , రహీం, లక్ష్మారెడ్డి, కొత్త శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page