నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

Spread the love

గతంలో ఏ రాజకీయ నాయకుడు.. ఏ పార్టీ.. ఏ ప్రభుత్వం కూడా.. ఏర్పాటు చేయని విధంగా.. నందిగామలో MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ,‌ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తెలుసుకోవడం అభినందనీయని తెలిపిన విద్యావేత్తలు, పట్టణ ప్రముఖులు ..

నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

విగ్రహాల ఏర్పాటు, హైకోర్టు తీర్పు అంశాలపై మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

గాంధీ సెంటర్ ను అభివృద్ధి చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం.. ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉన్నందునే విగ్రహాలను పక్కన ఏర్పాటు చేయాలనుకున్నాం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

నందిగామను అభివృద్ధి చేయాలని తలంపుతోనే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాం.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నందిగామను తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నాం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

గతంలో ఏ పార్టీ కూడా.. ఏ ప్రభుత్వం కూడా.. ఏ అంశంపై కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పార్టీల అభిప్రాయం, ప్రజాభిప్రాయం, విద్యావేత్తల, మేధావుల అభిప్రాయాలు తీసుకున్న దాఖలాలు లేవు.. కానీ అందరిని సమావేశ పరిచి మంచి పనులు చేయాలనే ఉద్దేశంతోనే నందిగామలో మా హయాంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేశాం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

విగ్రహాల ఏర్పాటుపై పిటిషనర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినప్పటికీ.. 17 నెలల తరువాత హైకోర్టు స్టే పిటిషన్ ను కొట్టివేస్తూ.. 3 అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది ..

హైకోర్టు తీర్పు ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కదల్చకుండా.. గాంధీ సెంటర్ సర్కిల్లో ట్రాఫిక్‌ కు అడ్డంగా ఉన్న విగ్రహాలను పక్కకు పెట్టాలని కోర్టు సూచనలు చేసింది .. హాస్పిటల్ స్థలం పరిధిలో నూతనంగా నిర్మించిన ప్లాట్ ఫామ్ పై విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని హైకోర్టు సూచన చేసినట్లు తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

కానీ గతంలో 18 నెలల క్రితం విగ్రహాల అంశాన్ని అప్పటి కలెక్టర్ జే. నివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లగా హాస్పిటల్ పరిధిలో గల 0.3 సెంట్ల భూమిని విగ్రహాల ఏర్పాటు కొరకు గవర్నమెంట్ స్థలంగా కన్వర్షన్ చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

కోర్టు సూచించిన నిబంధనలకు అనుగుణంగా.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుసరిస్తూ.. విగ్రహాల ఏర్పాటు పై ముందుకెళ్తాం.. ఏ ఒక్క జాతీయ నాయకుడి విగ్రహాన్ని, రాజకీయ నాయకుడు విగ్రహాన్ని తక్కువ చేయకుండా.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చేయాలన్నదే మా భావన ..

గాంధీ సెంటర్ ను నందిగామ పట్టణానికే ఐకానిక్ లా తీర్చిదిద్ది అభివృద్ధి చేయాలని.. అది మున్సిపాలిటీకి భారం కాకూడదనే ఉద్దేశంతో సియస్ఆర్ ఫండ్స్ ను తీసుకువచ్చాం ..

గాంధీ సెంటర్ పార్కులో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉండి ఉంటే.. ఖచ్చితంగా అది కూడా తొలగించి ఉండేవాళ్ళం.. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. అభివృద్ధే ప్రధానంగా పనిచేస్తున్నాం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

గతంలో రాత్రికి రాత్రే విగ్రహాలు తొలగించే అవకాశం మాకు ఉన్నప్పటికీ.. అలా చేయకూడదనే ఉద్దేశంతోనే.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చేయాలనే విగ్రహాలను కదల్చలేదు ..

నందిగామ అభివృద్ధికి అందరూ సహకరించాలి.. మరింత అభివృద్ధి జరిగేలా తోడ్పటునందించాలి.. మంచి పనులకు రాజకీయాలకు అతీతంగా మద్దతునివ్వాలని కోరిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

ముందుగా స్వర్గీయ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నమ్మ మృతికి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సభ్యులతో కలిసి సంతాప సూచికంగా మౌనం పాటించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరాం, పలు విద్యాసంస్థల అధినేతలు, తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు, నాయకులు, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, దళిత చైతన్య వేదిక, ముస్లిం చైతన్య వేదిక, ఎస్సీ -ఎస్టీ ఉద్యోగ సంఘాలు, పర్యావరణ పరిరక్షణ సమితి, సీనియర్ జర్నలిస్టులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page