స్వతంత్రవీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love


MLA who participated in the birth anniversary of independent Vadde Obanna…

స్వతంత్రవీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఓబన్న వీరోచిత పాత్ర పోషించారన్నారు. భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని, సమర్ధవంతంగా నడిపించి, బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు వడ్డే ఓబన్న అని గుర్తు చేశారు. అటువంటి మహనీయుడి జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషదాయకం అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వడ్డేర్ల సమస్యలను త్వరలోనే అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ గౌడ్, జాతీయ మహిళా అధ్యక్షురాలు వేముల తిరుమల దేవి మరియు స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, వేణు యాదవ్, శశిధర్, యేసురత్నం, ప్రభాకర్, సంతోష్, ఎర్ర లక్ష్మయ్య, వెంకటేష్, గిరి బాబు, రామకృష్ణ, మల్లేష్, తిరుపతి, అన్మయ్య, చిన్న హనుమంతు, మహంకాళి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page