అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకం: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Spread the love

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసిన రావి నారాయణరెడ్డి నగర్ (తూర్పు) వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సభ్యులు…

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రావి నారాయణరెడ్డి నగర్ (తూర్పు) వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి అధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ సంక్షేమ సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక అనేది అరుదు అని, కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకమన్నారు. రావి నారాయణరెడ్డి నగర్ (తూర్పు) వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం నూతనంగా కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బి.నారాయణ, ప్రధాన కార్యదర్శి వి. హన్మంత్ నాయక్, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page