ఏ చిన్న సమస్య రాకుండా మీకు అండగా ఉంటా : ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్

Spread the love

సాక్షిత*తిరుపతి నగరం:
ఏ చిన్న సమస్య రాకుండా మీకు ఎల్లవేళలా అండగా వుంటానని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహాల్ చేపల్ మార్కెట్ వద్ద చేపల మార్కెట్ షాపుల వాళ్ళతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని, రాష్ట్రంతో బాటు తిరుపతి అభివృద్ధిని కొనసాగిద్దామన్నారు.

రానున్న ఎన్నికలలో తిరుపతి అభివృద్ధి కోసం తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు జవాబుదారీగా ఉంటానని భూమన అభినయ్ రెడ్డి అన్నారు. చిరువ్యాపారులైన మీరు గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరే చూసారని, చేపల అమ్మే చిరు వ్యాపారులకు పలు మార్లు అధికారుల దగ్గర నుండి ఎన్ని సమస్యలు వచ్చినా నేను అండగా నిలబడ్డానని, ఇకపై కూడా మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను మీకు అండగా వుంటానని హామి ఇస్తున్నానని అభినయ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి మీఇంటి వద్దకె సంక్షేమ పాలన తీసుకొచ్చారని, నవరత్నాలైన అమ్మఒడి, వైయస్ఆర్ ఆసరా, విద్య దీవెన, వసతి దీవెన, వైయస్ఆర్ కల్యాణ కానుక, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, వైయస్ఆర్ చేయూత వంటి పథకాలతో మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.

చంద్రబాబుకు ఓటు వేస్తే సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాడని, సంక్షేమ పథకాలు నాశనం చేస్తాడని, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాడని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీకు మేలు చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించాలన్నారు. ఇక తిరుపతి అభివృద్ధి విషయానికొస్తే మెట్రో నగరాలతో పోటీ పడేలా మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీలెఫ్టు రోడ్లు, నగర సుందరీకరణ చేశామని, ఎన్నో ఏళ్ళుగా నానుతున్న 22ఏ భూ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించి మూల పత్రాలు పొందేలా భూ హక్కు కల్పించామన్నారు. రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఫిష్ మార్కెట్ గోవింధ్ రెడ్డి, షణ్ముగం, చెంగళ్ రాయులు, ఆర్ముగం, కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ, దూది శివ, అశోక్ రెడ్డి, లవ్లీ వెంకటేష్, యోగాంజనేయ రెడ్డి, స్టోర్ నాధముని తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page