ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగు నీరు అందించాలి

Spread the love

Mission Bhagiratha should provide potable water to every household

ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగు నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత* : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని అమ్రాది ఖుర్థు గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 10:30 AM వరకు పర్యటించారు.

◆ గ్రామంలో 4,6,7వ వార్డులలో నీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు తెలుపగా… వాటితో పాటు నూతనంగా నిర్మిస్తున్న 25 ఇళ్లకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసి, ప్రజలకు నీరు అందించాలని, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.

◆ గ్రామంలో ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పశువుల డాక్టర్ వచ్చి పశువులకు వైద్య సేవలు అందించాలని పశు వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

◆ గ్రామంలోని బావులపై పై కప్పులు ఏర్పాటు చేసి, పాడు బడ్డ ఇళ్ళు, పిచ్చి మొక్కలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

◆ గ్రామంలో శానిటేషన్ పనులు ప్రతి రోజు నిర్వహిస్తూ… ప్రతి వార్డులో ప్రతి రోజు చెత్త సేకరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

◆ థర్డ్ వైర్ పూర్తి స్థాయిలో గ్రామం మొత్తం ఏర్పాటు చేయాలని, గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, అవసరమైన చోట ఇంటర్ ఫోల్స్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు.

◆ నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీలలో త్రాగు నీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

◆ అనంతరం గ్రామ ప్రజలకు మంచి సేవలందిస్తున్న ANM విజయ, ఆశా వర్కర్ విజయ ను అభినందిస్తూ… వారిని శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page