మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్

Spread the love

తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

*

……..

సాక్షిత : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు.*

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందజేయాలన్నారు.

ఇకపై గిరిజన గురుకులాలలో ప్రత్యేక అధికారులతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు

విద్యార్థులు అనారోగ్యానికి గురైతే తక్షణమే వారి తల్లిదండ్రులకు తెలపాలి.
విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి సూచించారు.
……
మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ……

గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ప్రభుత్వం విద్యావ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.సోమవారం హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ లోని డీఎస్‌ఎస్‌ భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏ పీవోలు,ఆర్ సి ఓ లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు,గిరిజన గురుకులాల్లో పలు సమస్యలను మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఇకపై నిరంతరం గురుకుల విద్యాలయాల్లో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకులాల్లో ప్రస్తుత పరిస్థితులను,సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి , త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.గిరిజన గురుకులాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గురుకులలో ఇంగ్లీష్ విద్య అందించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇబ్బందులు తలెత్తకుండా, విద్యార్థులకు అందించాల్సిన బుక్స్, ఇతర సౌకర్యాలు, మంచినీరు, నాణ్యమైన ఆహారం, శానిటేషన్ ,పరిసరాల పరిశుభ్రత పై ఎక్కువగా దృష్టి సారించాలని అన్నారు.అంతేకాకుండా గురుకుల విద్యార్థులకు స్పోర్ట్స్ డైట్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.గురుకుల పాఠశాలలకు సమీపంలో ఉన్న పీ హెచ్ సీ వైద్య సదుపాయాలు , బాలికల గురుకులాల్లో గైనకాలజిస్టులో పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని,అందుకు కృషి చేస్తామని అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమా చూడని విద్యార్థులకు తప్పనిసరిగా సినిమా చూపించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.
………
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ ,అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీ విజయలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ చందన, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి,ఓ ఎస్ డి చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page