కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

Spread the love

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ బాలమణి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బౌరంపేట లోని వారి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించిన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి పాల్గొన్నారు

ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారిని కలవడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు,కులసంగ పెద్దలు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ వారు మాట్లాడుతూ ఈరోజు దేశంలో అత్యంత భద్రతగా ఎక్కడా బాంబు బ్లాస్ట్ లేకుండా కాశ్మిర్ నుండి కన్యాకుమారి వరకు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు గత కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో ఎవరి ప్రాణం పోతుందో తెలవని పరిస్థితి ఉండేది, కరోనా కాలంలోదేశం దారుణమైన పరిస్థితి లో ఉంటే వెంటనే స్పందించి తెలంగాణ హైదరాబాద్ గడ్డమీద వ్యాక్సిన్ తయారు చేయించి మన దేశ ప్రజలకు ఫ్రీ గా రెండు మూడు డోసులు ఇచ్చి మరియు పేద విదేశాలకు కూడా ఆడుకున్న మహనీయులు,500 సంవత్సరాల హిందువుల కల అయోధ్య లో రామ మందిర నిర్మాణం ప్రారంభించిన మూడేళ్లలోనే ప్రాణప్రతిష్ట చేసి దేశంలో ప్రతి వ్యక్తికి అక్షింతలు కూడా పంచి భగవంతుని ఆశీస్సులు కూడా అందించారు, ఆకలి చావులేకుండా పేదలకు ఉచిత రేషన్, ఆడబిడ్డ అవమాన పడకుండా ఇంటి ఇంటికి మరుగుదొడ్లు, ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు, ఇలా ఇంకా ఎన్నో ప్రధాని నరేంద్ర మోడీగారిది గొప్ప పరిపాలన గురించి కొనియాడారు

నేను ఈ పార్లమెంట్ ఎటు 20 కిలోమీటర్లు ఉండే నియోజకవర్గం మధ్యలో యంజాల్ గ్రామం రింగ్ రోడ్ పక్కనే సొంత ఇల్లు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వాడి మీ ఇంటి మనిషిగా మోడీగారు ప్రత్యేక శ్రద్ద పెట్టిన నియోజకవర్గం కాబట్టి బీజేపీ ని గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందాం అని వేడుకున్నారు మోడీగారి ఉత్తమపాలనకు ముగ్దులై 2009 కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల నాగయ్య ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ చేరడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్,నిజాంపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఆకుల సతీష్,సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ జంగారెడ్డి గోనె మల్లారెడ్డి,నర్సింహా చారి,డి ప్రభాకర్ రెడ్డి, నల్ల రామచంద్రరెడ్డి,సరుగారి సత్తిరెడ్డి, జంగారెడ్డి,రవికాంత్ రెడ్డి, మాధవరెడ్డి,రమేష్ చారి,వీరేష్ కుమార్, ప్రశాంత్ కుమార్, పోలింగ్ బూత్ అధ్యక్షులు,వివిధ కుల సంఘ నాయకులు చింత బిక్షపతి,బాలరాజ్, సత్యనారాయణ,లక్ష్మయ్య ప్రసాద్, బాలు, శ్రీకాంత్,అశోక్, అవినాష్ రెడ్డి,హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page