మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ఎమ్మార్పీఎస్, ఎస్సీ ఉపకులాల నాయకులు

Spread the love

Leaders of MMRPS and SC sub-castes met former MLA Koona Srisailam Goud

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ఎమ్మార్పీఎస్, ఎస్సీ ఉపకులాల నాయకులు


సాక్షిత : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దతకై చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒప్పించాలని ఎమ్మార్పీఎస్, ఎస్సీ ఉపకులాల నాయకులు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.

దానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు తన వంతు కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎస్సి ఉపకులాల నాయకులు చింతల రాజలింగం, సిలువేరు శ్రీనివాస్ మాదిగ, రసమల్ల యాదగిరి మాదిగ, సంగి మహేష్ మాదిగ, మట్ట నర్సయ్య మాల , సెపూర్ కుమార్, కిరణ్ కుమార్, మల్లీశ్వరి, అరెకటిక జ్యోతి, ఎసైరు రాణి మాదిగ తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page