నాడు నేడు పథకానికి లారస్‌ ల్సాబ్స్‌ రూ.4 కోట్లు విరాళం

Spread the love


Laurus Lsabs donated Rs.4 crores to the scheme today

నాడు నేడు పథకానికి లారస్‌ ల్సాబ్స్‌ రూ.4 కోట్లు విరాళం


సాక్షిత : లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్, ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్‌ తయారీ మరియు బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమం కింద రూ. 4 కోట్ల విరాళం అందజేశారు, దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన మరియు అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు మరియు సి.ఈ.ఓ డా. సత్యనారాయణ చావా, సీఎంతో, తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి, రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించే ముఖ్యమంత్రి ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమానికి గాను రూ. 4 కోట్ల రూపాయల విరాళ పత్రాలను అందజేశారు. నాడు – నేడు పథకం క్రింద లారస్‌ ల్యాబ్స్‌ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడవసారి*.

ఈ సందర్భంగా సీఎంని కలిసి డీడీ అందజేసిన లారస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు మరియు సి.ఈ.ఓ, డా. సత్యనారాయణ చావా, కార్పొరేట్‌ డెవలప్‌మెంట్, సింథసిస్‌ మరియు ఇంగ్రిడియంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరసింహారావు చావా, సీఎస్‌ఆర్‌ హెడ్‌ సౌమ్య చావా

Related Posts

You cannot copy content of this page