ఖమ్మం ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్ జన్మ దిన వేడుకలు

Spread the love

కేక్ కటింగ్… స్వీట్లు పంచిన నేతలు

ఉద్యమ కెరటం కేటీఆర్

కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణా అభివృద్ధి విశ్వ వ్యాప్తం

కేటీఆర్ బర్త్ డే వేడుకల్లో పలువురు వక్తలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జనం మెచ్చిన తెలంగాణా ఉద్యమ కెరటం… బంగారు తెలంగాణా యువ కిశోరం …ఐటీ రంగంలో తెలంగాణా కీర్తి ప్రతిష్టలను దేశ వ్యాప్తం చేసి, లక్షలాది మంది కి ఉపాధి కల్పించి, అభివృద్ధి లో తెలంగాణా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బీఆర్ఎస్ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు వేడుకలు ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి, కేటీఆర్ జన్మ దిన వేడుకల్లో పాల్గొని, స్వీట్లు పంచుకుని, ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జన హృదయ నేత కేటీఆర్ అని, ఆయన తెలంగాణా భవిష్యత్ ప్రదాత అని కొనియాడారు. నూతన ఆవిష్కరణలతో తెలంగాణా ప్రజలకు సూపరిపాలన అందిస్తున్న గొప్ప రాజ నీతజ్ఞుడు కేటీఆర్ అని అన్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు మళ్లించిన రాజకీయ మేధావి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణ, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నాయకులు గోడ్డేటి మాధవరావు, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, మునిగంటి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page