కేసీఆర్ కేటీఆర్ పేదింటి ఆడపడుచులు దసరా పండుగ ఆనందం

Spread the love

KCR KTR’s poor women are the joy of Dussehra festival

సాక్షిత : కేసీఆర్ కేటీఆర్ పేదింటి ఆడపడుచులు దసరా పండుగ ఆనందంగా జరుపుకోవాలని తెరాస ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందిస్తున్న బతుకమ్మ సారె చీరలు పంపిణీ కార్యక్రమం 124 డివిజన్ పరిధిలోని శంషిగుడా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడింది. ముఖ్య అతిధిగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హాజరై కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తో కలిసి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులందరు ఆనందోత్సవంతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా చీరలను అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు కాశినాథ్ యాదవ్, తెరాస నాయకులు రాములుగౌడ్, అగ్రవాసు, యాదగిరి, సత్యనారాయణ, వెంకటకృష్ణ, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, కైసర్, సంపత్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, టి.ఎల్.ఎఫ్ మంజుల, లక్ష్మమ్మ, స్వరూపా, దేవి, అంజలి, ఆర్.పి లు మంజుల మరియు వనజ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page