“Jyotishya Ratna” Award is a great honor for Grehiya.

Spread the love

“Jyotishya Ratna” Award is a great honor for Grehiya.

“జ్యోతిష్య రత్న” అవార్డు గ్రహితకి ఘన సన్మానం.

-సంతోషాన్ని పంచుకున్న బ్రహ్మశ్రీ గొల్లపల్లి విజయ్ కుమార్ చార్యులు

సాక్షిత,రామగుండం విశ్వజ్యోతిష్య విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్ష లో ఉత్తమ ప్రతిభ చూపించి, “జ్యోతిష్య రత్న” అవార్డు ని గైకొన్న బ్రహ్మశ్రీ గొల్లపల్లి విజయ్ కుమార్ చార్యులు కి పెద్దపల్లి జిల్లా, రామగుండం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఘన సన్మానం జరిగింది.

విశ్వజ్యోతిష్య విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి జ్యోతిష్య ఆస్టోలోజి పరీక్షలో 300 మంది జ్యోతిష్యులు పాల్గొనగా అందులో నుండి 15 మంది సెలెక్ట్ కాగా పెద్దపల్లి జిల్లా రామగుండం నుండి విజయం సాధించిన బ్రహ్మశ్రీ గొల్లపల్లి విజయ్ కుమార్ చార్యులు కి అరుదుగా ఇచ్చే “జ్యోతిష్య రత్న” అవార్డును ప్రధానం చేసినారు.

ఈ సందర్భంగా రామగుండంలోని వారి ఆత్మీయులు అందరు కలిసి రామగుండం ప్రెస్ క్లబ్ లో సన్మానించారు. అరుదుగా లభించే ఈ బిరుదు తమ తోటి వ్యక్తికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని తెలియజేసారు. అలాగే బ్రహ్మశ్రీ గొల్లపల్లి విజయ్ కుమార్ చార్యులు మాట్లాడుతూ తాను ఈ అవార్డు పొందినందుకు సంతోషంగా ఉందని, దానికి రామగుండం ప్రెస్ క్లబ్ లో, తన ఆత్మీయుల మధ్య సన్మానం జరగడం అనేది మారుపురానిదని, దీనికి తనకి, తన కుటుంబీకులకు ఎంతో సంతోషంగా ఉందని వ్యక్తంచేశారు.


ఈ కార్యక్రమంలో మడుపోజు వెంకటేశం, మొరుపోజు అంజయ్య, రామగిరి పూర్ణచంద్రచారి, కొంక సాయి, దాసరి నరేష్, జంబోజు వినయ్ కుమార్, గొల్లపల్లి కృష్ణమా చారి, మొరుపోజు ప్రసాద్, మొరుపోజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page