ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దమే

Spread the love

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దమే

అసమర్ధ వైసీపీని తరిమికొట్టెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. :

గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల

ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం, అయ్యవారిపల్లె గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి గ్రామ టిడిపి శ్రేణులు మేళాతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి వైసిపి అసమర్ధ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతుందని వైసీపీ చేస్తున్న అరాచకాలకు ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అన్నీ రంగాల్లో ముందంజలో ఉన్నదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని, ఉన్న పరిశ్రమలు వైసీపీకి ముడుపులు చెల్లించలేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయని, ఇక యువతకు ఉపాధి లేక వలసలు వెళ్తున్నారన్నారు, ఇక రైతాంగం జగన్ పాలనలో కుదేలు అయ్యిందని, అన్ని వర్గాల ప్రజలకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ మేరకు తెలుగుదేశం శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్ ప్రధాన కార్యదర్శి కొనతం రంగా రెడ్డి బండి నారాయణ రెడ్డి ఉపాధ్యక్షుడు సూరే కిట్టయ్య బియ్యాల నారాయణ బోయపాటి వెంకటేశ్వర్లు చేకూరి రమణారావు మండల రైతు అధ్యక్షులు గుడిసె పిచ్చిరెడ్డి సత్యనారాయణ కత్తి రమణ క్లస్టర్ ఇంచార్జ్ మారెడ్డి రంగారెడ్డి రాష్ట్ర ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు కటికె యోగనంద్ జిల్లా కార్యదర్శి గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి కంభం మండల ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లికార్జున కంభం మండల రైతు అధ్యక్షులు తోట శ్రీనివాసులు దద్దనాల శ్రీనివాసరెడ్డి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page