కేశినేని నాని ప్రచారానికి రావటమే కష్టం ! ఆయనకి ప్రజల స్పందన ఏం తెలుస్తుంది. ?

Spread the love

కట్టలు తెంచుకున్న ఆనందంతో వైసీపీ నేతలు తెలుగుదేశం లోకి చేరుతున్నారు

గతంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో తంగిరాల సౌమ్య నందిగామ లో గెలవబోతున్నారు

విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)

ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ విజయవాడ పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థి కేశినేని శివనాథ్ (నాని) పేర్కొన్నారు. నందిగామ పట్టణం ముక్కపాటి నగర్ లో కూటమి ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య, ఎంపీ అభ్యర్థి శివనాథ్ (చిన్ని) ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి కరప త్రాలను పంచుతూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. చిన్ని మాట్లాడుతూ 9వ వార్డులో ప్రజలు చూపించే ఆదరణ వస్తుంటే భారీ మెజారిటీరి ఈ వార్డు నుంచి రాబోతుందని, గత పది రోజుల నుంచి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తెలుగుదేశంలో చేరుదామని వైసిపి నాయకులు ఎదురు చూస్తున్నారన్నారు.

నందిగామ నియోజకవర్గం లో కూడా అధికార పార్టీతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు వైఖరి మార్చుకోకపోతే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మంచి అధికారుల ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. వైకాపా ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి అసలు ఎన్నికల ప్రచారం చేసుకోవటమే రాదని, ఏసీ గదుల్లో కూర్చుంటారు, నానికి ప్రజల స్పందన తెలియదు. మొదట్లో తెలుగుదేశం 60 శాతం ఖాళీ అయిద్ది అన్నారు. తర్వాత 20 శాతం అన్నారు. ఆ తర్వాత బ్యాలెట్ పత్రాలు చూస్తే తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు ఓటమి భయంతో మాట్లాడుతున్నారు. చివరికి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. చివరికి సొంత చెల్లెలు పైన ఎన్నికల కమిషన్ కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆడవారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటే ఏ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలి. కుటుంబ సభ్యుల పైన తప్పుడు ఫిర్యాదులు చేస్తూ కేసులు పెట్టిస్తున్నారు. ఇప్పటివరకు వైకాపా నాయకుల దౌర్జన్యాలకు భయపడి మౌనంగా ఉన్నారని, ఇప్పుడు అంతా బయటకు వస్తున్నారన్నారు. నందిగామలో తంగిరాల సౌమ్య భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page