Increased pension as promised – Speaker Tammineni Sitaram
ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ – స్పీకర్ తమ్మినేని సీతారాం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 3648 కిలోమీటర్లు తన సుదీర్ఘ పాదయాత్రలో అవ్వ తాతల కష్టాలను దగ్గరగా చూసి చలిoచి ఈ పెన్షన్ పెంపు నిర్ణయాన్ని ఆనాడే తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
వైయస్సార్ పింఛన్ కానుక వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలానికి సంబంధించిన 134 మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు అయింది. మండల కేంద్రంలో స్పీకర్ తమ్మినేని ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ క్యాడర్ వాలంటీర్లతో కలిసి పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ దశల వారీగా 3000 వరకు పెన్షన్ ని పెంచుకుంటూ పోతానని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారని ఇచ్చిన మాట ప్రకారం 2000 నుండి 2750 వరకు ఈనాడు పెంచారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 39 లక్షల మందికి 1000 రూపాయలు చొప్పున ఇస్తే ప్రస్తుతo జనన్న ప్రభుత్వం 64 లక్షల మందికి లబ్ధిదారులకు 2750 రూపాయలు పెన్షన్ రూపంలో అందజేస్తున్నామని గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కొరకు ఖర్చు చేసింది కేవలం 400 కోట్లే అని ప్రస్తుత ప్రభుత్వం 1787 కోట్లు పెన్షన్ కోసం కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు,మార్కెట్ కమిటీ చైర్మన్లు, సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.