SAKSHITHA NEWS

Incomplete underground drainage line in Brindavan Colony

బృందావన్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ లైన్ ను జిహెచ్ఎంసి అధికారులతో మరియు HMWS&SB ఏరియా మేనేజర్ లతో పర్యవేక్షించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .


సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోగల బృందావన్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ కు అవుట్ లెట్ పనులను పూర్తిగా చేయకపోవడంతో మ్యానువల్స్ నుండి డ్రైనేజ్ వాటర్ రోడ్లపైకి రావడంతో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మరియు HMWS&SB ఏరియా మేనేజర్ తో శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బృందావన్ కాలనీలో పర్యవేక్షించి సంబంధిత అధికారులకు అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని, స్థానిక కాలనీవాసులకు ఇబ్బందులు కాకుండా త్వరగా పనులను ప్రారంభించాలని అధికారులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి EE శ్రీనివాస్ , AE సునీల్ , హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్&ఎస్.బి ఏరియా మేనేజర్ సుబ్రహ్మణ్యం రాజు , డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, లింగంపల్లి విలేజ్ తెరాస ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, స్థానిక కాలోనివాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS