అర్హులైన 2059 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ

Spread the love

Distribution of Asara Pension Identity Cards to 2059 eligible beneficiaries

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని గోదా కృష్ణ ఫంక్షన్ హల్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్) , వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలోని అర్హులైన 2059 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి గారు ,గౌరవ కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు ,శ్రీమతి రోజాదేవి రంగరావు గార్ల తో కలిసి అర్హులైన 2042 మంది లబ్దిదారులకు చక్కటి విందు బోజనము పెట్టి ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పించన్ల పథకం చాలా గొప్పది అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాల తో అలరారిస్తూ ప్రజా సంక్షేమ,అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని, కుల,మత,ప్రాంత,పార్టీ ల భేదం లేకుండా అరులైన అందరికీ ఆసరా ఫించన్లు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు చాలా గొప్ప మానవతా వాది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు కొనియాడారు

అరులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా మరింత మందికి ఆసరా ఫించన్ల ను అందిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

అసహాయులకు ‘ఆసరా’తో కొండంత అండగా నిలుస్తున్న సీఎం శ్రీ కేసీఆర్.

వృద్ధులకు ఆర్థిక భద్రత తో కూడిన ఆసరా వారి జీవితంలో వెలుగులు నింపినది అని, సంఘంలో సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆత్మవిశ్వాసం నింపినది అని,

అందరికి ఆసరా అందిస్తూ ఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలుస్తున్నారని.

వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గింపు

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో ఆసరా ఫించన్లు

రాష్ట్రంలో నూతనంగా 10 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం అని

మొత్తం మీద 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గొప్పతనం అని

రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం 12 వేల కోట్ల ఖర్చు చేస్తుంది.

వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ,చేనేత కార్మికులు, గీత కార్మికులకు, బీడి కార్మికులకు ప్రతి నెలా రూ. 2016/- మరియు వికలాంగులకు రూ. 3016 /-ఇవ్వడం జరుగుతుంది.*

గతంలో 70 రూపాయలు ఉన్న పెన్షన్ ను 200 రూపాయల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం పై ఆర్థికంగా భారం అవుతున్న 2 వేలు,వికలాంగులకు 3 వేలకు పెంచి పెన్షన్ అందిస్తున్నారు

వృద్ధులు,వితంతులు,వికలాంగులు,ఒంటరి మహిళలకు,బీడీ కార్మికులకు,చేనేత,గౌడ కార్మికులకు, డయాలసిస్,బోధకాలు బాధితులకు కొండంత అండగా ఆసరా పథకం నిలుస్తుంది.*

సంక్షేమ,అభివృద్ధి సర్కార్ మనది…….కోవిడ్ వంటి విపత్కర కాలంలో కూడా అభివృద్ధి ,సంక్షేమం ఆపకుండా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.*

జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి,వృద్ధులు తమ పిల్లలకు భారం కావొద్దని ఆలోచిస్తూ ఉంటారు, వారికి ఆసరాగా ఈ పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

వృద్ధులకు,వితంతులకు,ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వికలాంగులతో పాటు, నేతన్నలకు,బోధకాలు వ్యాధి ఉన్న వారికి,డయాలసిస్ తో బాధ పడేవారికి పెన్షన్లు అందిస్తూ గొప్ప మానవతా వాదిగా,మనసున్న నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలుస్తున్నారన్నారు.*

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి మహిళల నీటి కష్టాలు తీర్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.*

-లింగంపల్లి లో ఒక అవ్వ మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఇంటి పెద్ద కొడుకు ఉండగా మాకేం సమస్య ఉంటది బిడ్డా అన్నది. ఇలా ఒక ధైర్యం ఇచ్చారు సీఎం కేసీఆర్ గారు.

  • పిల్లల చదువుల కోసం గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం.

-నాడు కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతే.. ఇప్పుడు 24 గంటల కరెంటు వల్ల పెద్ద మొత్తంలో పంటలు పండుతున్నాయి.*

  • అర్హులైన వారికి తప్పకుండా పింఛన్లు అందిస్తాము.
  • ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నాం, నిరంతర కరెంటు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, రైతుబంధు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, డబుల్ బెడ్ రూమ్లు ఇస్తున్నాం, కొత్త పింఛన్లు ఇస్తున్నాం.. ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్ గారిని గుర్తించుకోవాలి.

-ఉచితాలు బంద్ చేయమని అనుచిత సలహా ఇస్తున్నారు బిజెపి వాళ్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బంద్ చేయాలంట.*

బీజేపీ పాలిత రాష్ట్రాలలో 600 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తుంది అని ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్న పించన్ల వివరాలను అంకెల తో సహా వివరించడం జరిగినది.

తెలంగాణ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు అని , దేశానికి మన పథకాలు దిక్సుచి లాగా మారాయి అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, ప్రాజెక్టు ఆఫీసర్ ఇంద్రసేన్, తెరాస నాయకులు ,కార్యకర్తలు ,మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page