పేదలకు ఉపకరించే పధకాలు తెలంగాణా లోనే , కంటి వెలుగు ను ప్రజలు సద్వినియోగం

Spread the love


In Telangana itself, the schemes to help the poor are being utilized by the people

పేదలకు ఉపకరించే పధకాలు తెలంగాణా లోనే , కంటి వెలుగు ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్


సాక్షిత సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని జంట నగరాల ప్రజలు, సికింద్రాబాద్ నియోజకవర్గ పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గౌడ్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. మెట్టుగూడ లోని చింత బావి కమ్మునిటి హాల్ లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత, సితఫలమండీ లోని కుట్టి వెల్లోడి అసుప్రత్రిలో స్థానిక కార్పొరేటర్ కుమారి సామల హేమ, బౌద్దనగర్ కమ్మునిటి హాల్ లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెరస యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, నేతలు కరాటే రాజు, జీ హెచ్ ఎం సీ డిప్యూటీ కమీషనర్ దశరద్, వైద్యాధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ సక్కు బాయి, ప్రాజెక్ట్ అధికారి శ్రీనాథ్ లతో పాటు అధికారులు, నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ .. జూన్ 30 తేది వరకు కంటి వెలుగు కొనసాగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన బృందాలు ఇంటింటికీ తిరిగి ఆయా కేంద్రాల సమాచారం అందిస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 152 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తారని, రీడింగ్ సమస్యలు ఉన్న వారికి వెంటనే కంటి అద్దాలు అందిస్తారని అయన వివరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో తాజాగా 8 సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని పెంచుతామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కనీసం 2.94 లక్షల మందికి ఉచితంగా పరిక్షలు నిర్వహించాలని లక్షంగా నిర్ధారించుకున్నామని సెలవు రోజులు మినహా ఒక్కోరోజు 200 మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైతే వెంటనే కంటి అద్దాలను ఉచితంగా అందిస్తారని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు

.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ (అడ్డగుట్ట), BJR కమ్యూనిటీ హాల్ (అడ్డగుట్ట), ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం (తార్నాక డివిజన్)నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ (తార్నాక), చింత బావి కమ్యూనిటీ హాల్ (మెట్టుగూడ), ఉప్పరి బస్తి కమ్యూనిటీ హాల్ (సీతాఫల మండీ), UPHC కుట్టి వెల్లోడి (సితఫలమండీ), బౌద్దనగర్ కమ్యూనిటీ హాల్ (బౌద్దనగర్) ప్రాంగణాలల్లో కంటి వెలుగు శిబిరాలను తొలుత ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు

Related Posts

You cannot copy content of this page