ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు నీటి భరోసా
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గాంధీ నగర్ వాసులు బస్తిలో మంజీర వాటర్ సమస్యగా వుందని, నీళ్లు వస్తున్న తగినంత ప్రెషర్ రావడంలేదని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా, కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి జలమండలి అధికారులతో కలిసి గాంధీ నగర్లో పాదయాత్ర చేసి సమస్యను స్వయంగా తెలుసుకుని, జలమండలి అధికారులతో చర్చించి వారంరోజుల్లో సమస్యను పరిష్కరించి అందరికి త్రాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే పీజేఆర్ నగర్లో బ్లాక్ నెంబర్ 71 నుండి 103 వరకు ప్రెషర్ ఎక్కువ వస్తున్న అక్కడ ఉన్నవారు నీటిని వృధాగా రోడ్డుపై వదిలిపెడుతున్నారు, వారితో కార్పొరేటర్ మాట్లాడి నల్లా కనెక్షన్ కు ఆన్ ఆఫ్ లివర్ పెట్టుకుని అవసరం లేనప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలని సూచించారు. త్రాగునీరును వృధాపోనివ్వకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నారు. సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి చుక్కా ఒడిసిపట్టి భవిషత్ తరాలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు మధులత, బాలస్వామి, కటికరవి, జలమండలి మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇస్పెక్టర్ రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ శివ, బస్తి వాసులు అంజలయ్య, సలీమ్, మహేష్, రామాంజనేయులు, ప్రభాకర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.