హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

Spread the love

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

సాక్షిత : పదవీ విరమణకు ఒక రోజు ముందు తీపికబురు చెప్పిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు,నిర్మాణానికి పచ్చజెండా

సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులు

జర్నలిస్టులు,బ్యూరోక్రాట్లు,ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ

జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు,ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది – సీజేఐ

ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? – సీజేఐ

రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం- సీజేఐ

వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు – సీజేఐ

వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు – సీజేఐ

జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాం – సీజేఐ ఎన్వీ రమణ

వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు – సీజేఐ

ఐఏఎస్,ఐపీఎస్,ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండి – సీజేఐ

Related Posts

You cannot copy content of this page