త్యాగాల పవిత్ర పండుగ బక్రీద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి మమతా రెడ్డి

Spread the love

ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే త్యాగాల పవిత్ర పండుగ బక్రీద్ అని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి మమత రెడ్డి అన్నారు రేపు జరగనున్న బక్రీద్ పండగ పర్వదినం సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి రోడ్ లో గల ఈద్గా కాలనీ వద్ద జరుగుతున్న శానిటేషన్ పనులను కమిషనర్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకోవాలని ముస్లిం సోదరీ సోదరీమణులకు బక్రీద్ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేశారు మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులు జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా మున్సిపల్ వారి ఆధ్వర్యంలో త్రాగునీరు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాహీద సబీర్ ఖాన్ ,ఏఈ సతీష్,మనోహర్ వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సారిటరీ ఇన్స్పెక్టర్లు రాజు వారి సిబ్బంది సదానందం, శంకర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page