నేడు ఆ 6 జిల్లాలో భారీ వర్షాలు..!

Spread the love
నేడు ఆ 6 జిల్లాలో భారీ వర్షాలు..!


హైద‌రాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు దంచికొడుతున్న విష‌యం విదిత‌మే. గురువారం రోజు ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌ను వ‌ర్షాలు ముంచెత్తాయి. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో అయితే ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురిసింది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

శుక్ర‌వారం రోజు వికారాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ జిల్లాల ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని చెప్పింది.

శ‌నివారం రోజు నిజామాబాద్, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, వికారాబాద్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

Related Posts

You cannot copy content of this page