జనసేన పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజినిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని తోపాటుగుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోశయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నూరి ఫాతిమా గెలుపు కోసం పనిచేస్తామని సురేష్ చెప్పారు. ఈ రోజు వందలాది మంది జనసేన కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. ఆయనతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు గులాం రసూల్, బూసిరెడ్డి మల్లీశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.
మంత్రి విడదల రజినిని కలిసి మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…