అర్హత కలిగిన ప్రతి పేదవాళ్లుకు ఇళ్లు మంజూరు : ఎం ఎల్ ఏ భుమన

Spread the love
Grant of houses to every eligible poor: MLA Bhumana

అర్హత కలిగిన ప్రతి పేదవాళ్లుకు ఇళ్లు మంజూరు : ఎం ఎల్ ఏ భుమన

గృహ నిర్మాణాలలో రోజు వారి పురోగతి వుండాలి : జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి

సాక్షిత తిరుపతి :   రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవాళ్లుకు ఇంటి పట్టా, ఇళ్లు మంజూరు హామీ మేరకు నగర పరిధిలో అర్హత గల వారికి తప్పని సరి 90 రోజుల కార్యక్రమంలో మంజూరు చేయాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి అధికారులకు సూచించారు.

తిరుపతి నగరపాలక పరిధిలో లబ్దిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాలకు కావలసిన మెటీరియల్ సరఫరాపై ఆర్.డి.ఓ లు, తహశీల్దారు లు తక్షణ చర్యలు చేపట్టి వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు.

నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో తిరుపతి అర్భన్ లబ్ధిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాల పురోగతిపై శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ ,నగరపాలక సంస్థ కమీషనర్ అనుపమ అంజలి సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఇంటి పట్టాలు అందుకున్న లబ్దిదారులవి ఏ ఒక్క పట్టాలు రద్దు కారాదని, అర్హత కలిగి అందిన దరఖాస్తు దారులకు 90 రోజుల్లో పట్టా అందించాలని అన్నారు.

కనీసం మరో వెయ్యి పట్టాలు అందించడానికి సరిపడా స్థలాలు గుర్తింపు పూర్తి కావాలని అన్నారు. పట్టాలు అందుకుని మరణించి వుంటే వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని, అప్పుడే వారికి నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు.

గడప గడపకు కార్యక్రమంలో పట్టా ఇచ్చి జియో టాగింగ్ జరగలేదని, స్థలం చుపలేదని ఏ ఒక్కరూ అడగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక కార్యక్రమం అనేది గుర్తుపెట్టుకుని పేదలకు ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగర నివాసిత లబ్దిదారులకు కేటాయించిన ఐదు లే ఔట్లలోని  గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని, ప్రతి లే ఔట్ లో రోజుకు కనీసం 50 గృహాల స్టేజ్ కన్వర్షన్లు జరగాలని అన్నారు. ప్రతి రోజు ప్రతి లే ఔట్ లలో కనీసం 15 వేల ఇటుకలను అందుబాటులో ఉంచేందుకు ఆర్డీఓ లు , తహశీల్దారులు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.


ఇంటి పట్టాలు అందుకున్న లబ్దిదారుల జియో టాగింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఇప్పటికే కేటాయించిన పట్టాలలో ఇళ్ళు నిర్మాణానికి వీలు పడని ప్రదేశం ఉంటే మార్పులు పూర్తి చేయాలని తెలిపారు.

ఈ సమీక్షలో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆర్.డి.ఓ.లు తిరుపతి, శ్రీకాళహస్తి కనకనరసా రెడ్డి , రామారావు, హౌసింగ్ పి.డి. చంద్రశేఖర్ బాబు, నగరపాలక డిప్యూటీ కమీషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, లే ఔట్ ఇంచార్జిలు, ఈ.ఈ.లు, డి.ఈ.లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page