కల్వకుంట్ల తారక రామారావు కి ,జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Spread the love

తెలంగాణ యువతరానికి ఆదర్శం, సకల గుణాభిరాముడు,తండ్రికి తగ్గ తనయుడు, జనహృదయ నేత, ప్రజలు మెచ్చిన నాయకుడు, ఐటి,పరిశ్రమల,పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల మంత్రివర్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో భాగంగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించి, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి కేక్ కట్ చేసి గిఫ్ట్ ఏ స్మైల్ లో కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ నివాసి దివ్యాంగుడు అస్లాం ఖాన్ కి వాహనం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం ను పురస్కరించుకుని సర్వమత ప్రార్ధనలు నిర్వహించడం జరిగినది అని.
మంత్రి కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని , సుఖ సంతోషాలతో , నిండు నూరేళ్ల జీవించాలని, మరింత ప్రజా సేవ చేయడానికి శక్తిని ప్రసాదించాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ,. బడుగు బలహీన వర్గాలకు అండగా సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి, మన తెలంగాణ రాష్ట్రాన్ని మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారిదని పేర్కొన్నారు. మంత్రివర్యులు కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, మరింత ప్రజా సేవ చేయాలని తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణ ను బంగారు తెలంగాణ దిశలో అడుగులు వేయిస్తున్న ముఖ్యమంత్రికేసీఆర్ కి , మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతఘ్నతలు తెలియ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని ,అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తున్నాని ,ని, ప్రతి ఇంటికి మంచి నీటిని అందిస్తున్నామని ,నియోజకవర్గ అభివృద్ధికి శాయషెక్తుల కృషి చేస్తున్నాని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page