భారతరత్న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల

Spread the love

Garland of Bharat Ratna Dr. Baba Saheb Ambedkar statue

*సాక్షిత : భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు గల భారతరత్న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *

ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు,

వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. మన దేశ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని, మనదేశ రాజ్యాంగాన్ని 1947 నవంబర్ 26 న అప్పటి అసెంబ్లీ ఆమోదం

తెలిపితే 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు నుండి ఆమోదం వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఆనాటి మేధావుల పరిజ్ఞానానికి గుర్తుగా నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page