SAKSHITHA NEWS

From January.. to start generating electricity in the solar plant

జనవరి నుండి.. సోలార్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించండి.

  • కమిషనర్ అనుపమ
    సాక్షిత : సోలార్ ప్రాజెక్ట్ లో పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసి జనవరి మాసం నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్ సిటీ ఎం.డి. అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.

రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఏర్పాటు చేస్తున్న గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్ ను గురువారం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుమారు 25 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో 26 ఎకరాల్లో ఈ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ ప్లాంట్ పూర్తి అయితే 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులు డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేసి జనవరి నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అలాగే ప్లాంట్ చుట్టూ ప్రహరీ గోడ పూర్తి చేయాలని, ప్లాంట్ మధ్యలో ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఏ ఈ కామ్ ప్రతినిధులు బాలాజీ, అనిల్, సుధీర్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS