పెండింగ్ కేసుల దర్యాప్తులు పకడ్బందీగా చేయాలి.

Spread the love

Investigations of pending cases should be carried out thoroughly.

పెండింగ్ కేసుల దర్యాప్తులు పకడ్బందీగా చేయాలి.బాధితులకు న్యాయం చేయాలి.


సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా

పెండింగ్ కేసులు తగ్గించాలి. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ 50 మంది పోలీసులకు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ కార్యక్రమం. కేసుల దర్యాప్తులలో పోలీసు అధికారులు, సిబ్బంది వృత్తి పరమైన సామర్థ్యం, నైపుణ్యం పెంచుకునేలా చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ద్యేశం అని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ తెలిపారు.


25 మంది జూనియర్ ఇన్వెస్టిగేషన్ పోలీసు ఆఫీసర్స్ కు, 25 మంది కంప్యూటర్ కానిస్టేబుళ్ళకు కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో దర్యాప్తులలో, వృత్తిలో(సి సి టీ ఎన్ ఎస్ ) సాంకేతిక పరిజ్ఞాన మెళకువల పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.9 వ బ్యాచ్ లో భాగంగా మొత్తం 50 మంది పోలీసులకు జూనియర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్స్ గా కంప్యూటర్ కంప్యూటర్ కానిస్టేబుళ్ళు గా తీర్చిదిద్దేందకు ఒక వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపియస్ హాజరై జూనియర్ ఇన్వెస్టిగేషన్ పోలీసు ఆఫీసర్స్, కంప్యూటర్ కానిస్టేబుళ్ళ తో మాట్లాడారు. కేసుల దర్యాప్తులలో అందరూ బాధ్యతగా పని చేయాలన్నారు. వృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం పై (సి సి టీ ఎన్ ఎస్ ) అవగాహన కలిగి ఉండి పెండింగ్ కేసులను తగ్గించాలన్నారు.


దర్యాప్తులు పకడ్బందీగా చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులు చేపట్టే పోలీసు అధికారులకు దర్యాప్తుల పై , కంప్యూటర్ కానిస్టేబుళ్ళకు సాంకేతిక పరిజ్ఞానం పై మెళకువలను, సలహాలు, సూచనలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, నాగభూషణం, సిఐలు శివశంకర్, జాన్సన్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page