పలాస మండలానికి నాలుగు డిజిటల్ లైబ్రరీలు మంజూరు

Spread the love

పలాస మండలానికి నాలుగు డిజిటల్ లైబ్రరీలు మంజూరు

రూ.64 లక్షలతో నాలుగు డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి నిధులు మంజూరు

సాక్షిత : విజయవాడ తన క్యాంపు కార్యాలయంలో పలాస మండలం నాయకులకు మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి డాక్టర్ సీదిరి.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్నో సంస్కరణలు విద్యావ్యవస్థలో తీసుకురావడం మనందరికీ తెలిసిందే.. దీనిలో భాగంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కృషితో పలాస నియోజకవర్గం, పలాస మండలంలో విద్యా విజ్ఞానాని మరింత ప్రాధాన్యత కల్పిస్తూ పలాస మండలానికి నాలుగు డిజిటల్ లైబ్రరీలు మంజూరు చేయడంతో ఆ మండల నాయకులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేశారు.


ఈ లైబ్రరీలు బ్రాహ్మణతర్ల,టెక్కలి పట్నం,అల్లుకోల మరియు మాకన్నపల్లి ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దానికి రూ.16 లక్షలు చొప్పున మొత్తం నాలుగు డిజిటల్ లైబ్రరీలు కోసం రూ.64 లక్షలు మంజూరు కావడం జరిగింది.

ఇందులో భాగంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు విజయవాడలో వారి క్యాంపు కార్యాలయంలో పలాస మండల నాయకులకు మంజూరు పత్రాలను అందజేశారు‌.

ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి తోపాటు మండల పార్టీ అధ్యక్షులు పైల వెంకట్రావు (చిట్టి) , ఎంపీపీ ప్రతినిధి ఉంగ సాయి కృష్ణ , మండల అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గొర్లె వేణుగోపాల్ , సర్పంచుల సంఘం అధ్యక్షులు కొర్ల శివ కృష్ణ ,చినంచల సర్పంచ్ ప్రతినిధులు కంచరాన భాస్కర్ రావు , బొచ్చ షన్ముఖరావు , పినకాన జోగారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page