మరిపించి… మురిపించారు… ప్రజల గుండెల్లో నిలిచారు…!

Spread the love

అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సాఆర్ దే

  • ప్రస్తుతమున్న తెలంగాణకు రాజన్న పాలన మళ్లీ కావాలి
  • రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే మన లక్ష్యం
  • రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ పొంగులేటి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు… వితంతు… అసరా పెన్షన్లు… 104… ఆరోగ్య శ్రీ… ఫీజు రియంబర్స్ మెంట్… రుణమాఫీ… లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి గుండెల్లో వెలుగులు నింపిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంతమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని మరిపించి… మురిపించేలా చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని ధంసలాపురం, రాపర్తినగర్ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విగ్రహాలకు పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమమైన ముఖ్యమంత్రులు అనగానే కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే వినిపిస్తాయన్నారు. ఒకరు నందమూరి తారక రామారావు కాగా, మరొకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్ చనిపోయి ఏళ్లు గడిచిన నేటికి ప్రజలు స్మరించుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనుల ద్వారా మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న తెలంగాణకు రాజన్న పాలన మళ్లీ తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. రాబోవు కురుక్షేత్ర యుద్ధంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడమే లక్ష్యంగా మనమంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్లు మలీదు జగన్, మిక్కిలినేని నరేంద్ర, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రఫీదా బేగం, నాయకులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎం.డి. ముస్తఫా, మియాభాయ్, ఇమామ్, కొప్పెర ఉపేందర్, బాణాల లక్ష్మణ్, బోడా శ్రావణ్ కుమార్, మందడపు రామకృష్ణ రెడ్డి, చావా శివరామకృష్ణ, పల్లె బోయిన చంద్రయ్య యాదవ్, దుంపల రవికుమార్, చెల్లా రామకృష్ణా రెడ్డి, కె .వి. చారి, మందడపు నాగేశ్వరరావు, కాంపాటి రమేష్, మొగిలిచర్ల సైదులు, కీసర పద్మజా రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, వేముల సీత, శ్రీ కళా రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్, తిప్పి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తాళ్లూరి రాము, ఎయిర్ టెల్ నరసింహారావు, ఉమ్మినేని కృష్ణ, కొడాలి గోవిందరావు, వట్టికూటి సైదులు గౌడ్, కరాటే వేణు, ఉపేందర్, యువనేత గోపి, ఆటో ప్రసాద్, ఎ.వి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page